టెక్నాలజీ రంగంలో భారత్ వెలిగిపోతున్నది. ఒకప్పుడు దేశంలో ఎక్కడో ఒకచోట సాఫ్ట్వేర్ కంపెనీలు దర్శనం ఇచ్చేవి. కానీ, ఇప్పుడు దేశంలోని ప్రతి రాష్ట్రంలో సాఫ్ట్వేర్ కంపెనీలను నెలకొల్పుతున్నారు. దేశీయంగా తయారైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
Software Exports: టెక్నాలజీ రంగంలో భారత్ వెలిగిపోతున్నది. ఒకప్పుడు దేశంలో ఎక్కడో ఒకచోట సాఫ్ట్వేర్ కంపెనీలు దర్శనం ఇచ్చేవి. కానీ, ఇప్పుడు దేశంలోని ప్రతి రాష్ట్రంలో సాఫ్ట్వేర్ కంపెనీలను నెలకొల్పుతున్నారు. దేశీయంగా తయారైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అగ్రదేశాలతో భారత్ నేడు పోటీ పడుతున్నది. దేశీయంగా నాణ్యమైన నిపుణులు ఉండటమే ఇందుకో ఉదాహరణ. ఒకనాడు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితుల నుంచి దేశీయంగానే ఉద్యోగాలు తెచ్చుకునే స్థితికి భారత్ ఎదిగింది. నేడు సాఫ్ట్వేర్ అంటే భారత్, భారత్ అంటే సాఫ్ట్ వేర్ అనే స్థాయికి ఎదిగింది. ఏడాదికేడాది సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి.
ఫినాన్షియల్ ఇయర్ 2021-22లో భారత్ నుంచి రూ. 11.59 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. సాఫ్ట్వేర్ ఉత్పుత్తుల ఎగుమతుల్లో కర్ణాటక రూ. 3.96 లక్షల కోట్లతో ప్రథమ స్థానంలో ఉండగా, మహారాష్ట్ర రూ. 2.37 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ. 1.81 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉండగా, తమిళనాడు రూ. 1.58 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే, గతంలో సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిన ఆంధ్రప్రదేశ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తుల వాటా దారుణంగా పడిపోయింది. ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి కేవలం రూ. వెయ్యి కోట్ల విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతయ్యాయి. విజయవాడ, విశాఖ పట్నంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని తమ కార్యాలయాలను అక్కడి నుంచి హైదరాబాద్, చెన్నైకి తరలించారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగం దినదినాభివృద్ధి చెందుతుండగా, ఆంధ్రప్రదేశ్లో ఈ రంగం అథఃపాతాళానికి పడిపోయింది. ఐటీ మంత్రులు తమ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఏపీ మాత్రం సంక్షేమాలపై దృష్టిసారించి మిగతా రంగాలను పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐటీ రంగం అభివృద్ది సాధిస్తే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ఐటీ రంగంపై దృష్టి సారిస్తే మంచిది.