Kapu Politics in AP: ఏపీలో కాపుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈ సారి కాపు(Kapu Community)లు జనసేన(Janasena)కు మద్దతుగా నిలుస్తారనే ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం(Telugudesam)..జనసేన పొత్తుతో కాపు ఓటింగ్ ఆ రెండు పార్టీలకు మళ్లుతుందనే అంచనాలు ఉన్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ(Mudragada) వైఎస్సార్సీపీ నేతలు వరుస భేటీలు కొనసాగిస్తున్నారు. పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కాపు రిజర్వేషన్ వ్యవహారం ఎటూ తేలలేదు. గోదావరి జిల్లాల్లో(Godavari Dists) కాపు ఓటింగ్ కోరుకొనే సమయంలోనే ఇతర వర్గాల ఓటింగ్ నిలబెట్టుకోవటం పార్టీలకు కీలకంగా మారుతోంది. కాపులకు సీఎం(CM) పదవి కావాలనే డిమాండ్ పైన చర్చ జరుగుతోంది. ఈ సమీకరణాల నేపథ్యంలో కాపు(Kapu)లు ఎవరికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.
2014 ఎన్నికల తరువాత అప్పటికే ఉన్న కాపు రిజర్వేషన్(Kapu Reservation) వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. సీరియస్ అయింది. కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమ సమావేశం రైలు దహనం వరకు వెళ్లింది. కాపు రిజర్వేషన్ల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) అప్పట్లోనే మంజునాధ కమిషన్ వేసారు. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాపులను బీసీల్లో చేర్చాలంటూ అసెంబ్లీ(Assembly)లో తీర్మానం చేసి పంపారు. ఆ తరువాత కేంద్రం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు(EWS Reservation) తీసుకొచ్చింది. అందులో అయిదు శాతం కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్(YS Jagan) అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని రద్దు చేసారు. ఇప్పుడు ఆ నిర్ణయం అమలు కోసం కాపు నేతలు(Kapu Leaders) న్యాయస్థానాలు ఆశ్రయించారు.
2019 ఎన్నికల సమయంలో కాపు రిజర్వేషన్లు(Kapu Reservations) సాధ్యం కాదని జగన్ ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో కాపులకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సమయంలో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ జగన్ కు సీట్ల సంఖ్యను పెంచింది. గెలిచిన తరువాత కేబినెట్(Cabinet) లో కాపు వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. కాపులకు నాడు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే ఒత్తిడి ప్రభుత్వం పైన పెరిగింది. జగన్ నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఇప్పుడు కాపుల్లో తమ వారికి సీఎం పదవి కావాలనే కోరిక బలంగా ఉంది. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. జనసేన..టీడీపీ(TDP Janasena) పొత్తు కారణంగా కాపు ఓట్ బ్యాంక్ ఈ రెండు పార్టీలకు మళ్లే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
కాపు ఓటింగ్ బలంగా ఉన్న గోదావరి జిల్లాలే ఎవరు అధికారంలోకి రావాలనేది డిసైడ్ చేస్తాయి. అక్కడ ఉన్న సామాజిక సమీకరణాల్లో కాపులను మచ్చిక చేసుకొనేందుకు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. పవన్ కల్యాణ్(Pawan Kalyan) తాను కాపుల కోసమే మాదని..అన్ని వర్గాల కోసం నిలబడ్డానని తన మీద ఉన్న కాపు అనుకూల ముద్ర తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ తో పొత్తు ద్వారా కాపు ఓటింగ్ ను దగ్గర చేసుకోవాలనే వ్యూహం చంద్రబాబు(Chandra Babu) అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఈ మధ్య కాలంలో కాపు ఉద్యమనేత ముద్రగడ(Mudragada)తో పలు సార్లు సమావేశం అయ్యారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ముద్రగడ పార్టీలో చేరితే కాకినాడ(Kakinada) లోక్ సభ..ఆయన తనయుడు పార్టీలోకి వస్తే పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ సీటు ఆఫర్ చేసారు.
కాపుల మద్దతు కోసం పవన్ కల్యాణ్..చంద్రబాబు..ఇటు ముద్రగడ ద్వారా ముఖ్యమంత్రి జగన్(CM YS Jagan) ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ కాపు ఉద్యమం..రిజర్వేషన్ల అంశం పైన గతంలో వలే ప్రశ్నించలేదనే అభిప్రాయం ఉంది. జగన్ కు ముద్రగడ మద్దతుగా నిలుస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య (Jogaiah) నాయకత్వంలో కాపు సేన కొనసాగుతోంది. పవన్ (Pawan Kalyan) ను సీఎం చేయాలనేది ఆయన డిమాండ్. చంద్రబాబు ప్రభుత్వంలో నిర్ణయించిన కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు(Reservations) అమలు చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ ఏపీలో కాపు నేతలకు ప్రాధాన్యత ఇస్తోంది. బీఆర్ఎస్ (BRS) ఏపీ అధ్యక్ష పదవికి కాపులకు కేటాయించింది. రాష్ట్ర అధ్యక్ష పదవిలోనూ కాపు నేత ఉన్నారు.
బీజేపీ..జనసేన మధ్య ఇప్పటికీ పొత్తు కొనసాగుతోంది. గోదావరి జిల్లాలతో పాటుగా ఉమ్మడి క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కాపు ఓటింగ్ (Kapu voting) కీలకం కానుంది. రాయలసీమ (Rayalaseema)ప్రాంతంలో బలిజ ఓటింగ్ పైనా పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాయి. సామాజిక సమీకరణంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ వర్గం ఓట్లు చే జారకుండా ఉండేందుకు పార్టీలు తిప్పలు పడుతున్నాయి. కాపు ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో ఈ సారి మెజార్టీ కాపులు(Kapu voting) ఎవరి వైపు నిలుస్తారు..ఎవరి గెలుపుకు దోహదం చేస్తారనేది ఎన్నికల సమయానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.