ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ వార్డు, సచివాలయాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పనిచేసే యువతకు వాలంటీర్లుగా, వార్డు, సచివాలయ ఉద్యోగులను ఏర్పాటు చేశారు.
Village Secretariat: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ వార్డు, సచివాలయాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పనిచేసే యువతకు వాలంటీర్లుగా, వార్డు, సచివాలయ ఉద్యోగులను ఏర్పాటు చేశారు. వీరంతా వారి గ్రామాల్లోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉండటంతో నేడు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. గ్రామంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశారు. వార్డు, సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని నియమాలు, షరతులు, పదోన్నతులు, బదిలీలు వీరికి కూడా వర్తిస్తాయి.
అయితే, వార్డు, సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. కొంతకాలంగా బదిలీలు చేపట్టాలనే డిమాండ్ ఉన్నది. అయితే, రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకొని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు ఆర్హులని ప్రభుత్వం ప్రకటించింది. బదిలీలు పొందాలని కొరుకునే ఉద్యోగులకు జూన్ 10 వరకు మాత్రమే అవకాశం ఉంది. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా, అంతర్జిల్లా బదిలీలకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్పౌజ్, పరస్పర అంగీకారంతో కూడిన బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.