ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా ఆకుల వెంకట శేషసాయిని నియమిస్తూ కొలిజియం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యారు. మిశ్రా బదిలీ కావడంతో ఆయన స్థానంలో వెంకట శేషసాయిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఆకుల వెంకట శేషసాయిని నియమిస్తూ కొలిజియం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యారు. మిశ్రా బదిలీ కావడంతో ఆయన స్థానంలో వెంకట శేషసాయిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్‌తో పాటుగా మరికొందరిని కూడా సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తూ న్యాయశాఖ నిర్ణయం తీసుకుంది. న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ బదిలీ చోటు చేసుకోవడం విశేషం. ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు సీనియర్ లాయర్ విశ్వనాథ్‌ను కూడా కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఆయన న్యాయవాదిగా పనిచేస్తూ వస్తున్నారు. కాగా, ఆయనకు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టుకు బదిలీ చేయడం విశేషం.
వీరిద్దరి చేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇక సుప్రీంకోర్టులో ఉండవలసిన 34 మంది జడ్జీలలో ఇద్దరు ఇటీవలే రిటైర్ అయ్యారు. వీరి స్థానంలో ప్రశాంత్ కుమార్ మిశ్రా, కెవీ విశ్వనాథ్‌లను నియమించారు. ఇక ఇదిలా ఉంటే, ఈనెల 16న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం ప్రతిపాదనలను పంపగా కేంద్ర న్యాయశాఖ యధాతథంగా వాటిని ఆమోదించింది. గత కొన్ని రోజులుగా కేంద్ర న్యాయశాఖకు, సుప్రీంకోర్టుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొలీజియం విషయంలో రగడ జరిగింది. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజును ప్రభుత్వం వేరే శాఖకు బదిలీ చేసి ఆయన స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్ను నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే కొలిజియం ప్రతిపాదనలకు ఆమోదించడం విశేషం.